వీక్షకులకు సూచన

ఈ బ్లాగులో ఆర్టికల్స్ చదవటంకోసం ఇమేజ్స్ మీద క్లిక్ చెయ్యండి.

20, జనవరి 2010, బుధవారం

తిరుప్పావై పాశురం - 30

వంగక్కడల్‌ కడైంద మాధవనై క్కేశవనై
తింగళ్‌ తిరుముగత్తు చ్చేయిళై యార్‌ శెని€రైంజి
అంగప్పఱై కొండవాత్తై యణిపుదువై
ప్పైంగమల తణైరియల్‌ పట్టర్‌పిరాన్‌ కోదై శొన్న
శంగ త్తమిళ్‌ మాలై ముప్పదుం తప్పామే
ఇంగు ఇప్పరిశురైప్పార్‌ ఈరిరండు మాల్వరైత్తోళ్‌
శెంగణ్‌ తిరుముగత్తు చ్చెల్వత్తిరుమాలాల్‌
ఎంగుం తిరువరుళ్‌ పెత్తు ఇను€రువ రెమ్బావా§్‌ు
ఈ పాశురమును ఫలశ్రుతి పాశురము అని అంటారు.

ఓడలతో కూడిన సాగరము మధించిన ఓ మాధవా! కేశవా! చంద్రుని పోలిన దివ్య తిరుముఖమండలం కలవాడా! మేమంతా దివ్య ఆభరణములను ధరించి నీవద్దకు చేరితిమి. ఆనాడు ఆగోకులమున పర అను వాయిద్యమును పొంది ఎవరైతే సంతోషించిరో అట్టి ఫలమును నేడు ఇచట కూడా ఈ జగత్తుకే మణిపూస వంటి శ్రీవిల్లిపుత్తూరులో కూడా పొంది ఉంటిమి.
మా తండ్రి గారైన విష్ణుచిత్తుల వారు నల్లని, చల్లని తామరపూసల మాల ధరించినటువంటి వారు- మాస్వాచార్యులు- సంబంధముతో గోదా అయిన నేను చెప్పుచున్నాను.

ఎవరైతే ఈ 30 తమిళ పాశురములు సంఘములుగా క్రమం తప్పక పాశురములను పాడుతారో వారందరు ఈభూ లోకములో తరుగులేని సంపదలను పొంది తీరెదరు పరలోకములో మోక్షసంపదను కూడా పొంది తీరెదరు అని వ్రత ఫలితమును ఆండాళ్‌ ఈ చివరి పాశురములో తెలియజేస్తుంది. ఈ వ్రత ఫలముగా ఆండాళ్‌ తల్లి శ్రీరంగనాథుని చేపట్ట కలిగింది. అట్టి భాగ్యము మనందరకు కలుగుగాక! అని ప్రార్థించుచున్నాము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి