వీక్షకులకు సూచన

ఈ బ్లాగులో ఆర్టికల్స్ చదవటంకోసం ఇమేజ్స్ మీద క్లిక్ చెయ్యండి.

7, జనవరి 2010, గురువారం

తిరుప్పావై పాశురం - 17

అమ్బరమే తణ్ణీరే శోఱే అఱం శెయ్యుం
ఎమ్బెరుమాన్ నందగోపాలా! ఎరుందిరాయ్
కొన్బనార్ క్కెల్లాం కొరుందే! కుల విళక్కే
ఎమ్బెరుమాట్టి యశోదా! అఱివుఱాయ్
అమ్బరం ఊడఱుత్తు ఓంగి ఉలగళంద
ఉమ్బర్ కోమానే! ఉఱంగాదు-ఎరుందిరాయ్
శెమ్బొఱ్ కరలడి చ్చెల్వా బలదేవా!
ఉమ్బియుం నీయుం ఉఱంగ్-ఏలోర్ ఎంబావాయ్


వస్త్రములు కావలసినవారికి వస్త్రములు, మంచి నీరు , అన్నము కావసినవారికి అన్నము, ఫలాభిసంధి లేక ధర్మ బుద్ధితో దానము చేయు నందగోపాలా! మా స్వామీ! మేల్కొనుము , ప్రబ్బలి చెట్ల వంటి సుకుమారములగు శరీరములు గల స్త్రీలలో చిగురువంటిదానా! మా వంశమునకు మంగలదీపము వంటిదానా! మా స్వామినీ ! యశోదా! మేలుకొనుము. ఆకాశ మధ్య భాగమును చీల్చు కొని పెరిగి లోకముల నన్నిటిని కొలిచిన త్రివిక్రమా ! నిత్యసురులకు నాయకుడా! నిద్ర పోకూడదు. మేల్కొనుము. స్వచ్ఛమైన ఎర్రని బంగారుముతో చేయబడిన కడియము కాలిని దాల్చిన బలరామా! నీవును, నీ తమ్ముడును మేల్కొనవలెను అని గోపికలు ప్రార్ధించిరి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి